దక్షిణాది నటి అమలా పాల్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విభిన్న పాత్రలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే చాలా కాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ భామ త్వరలోనే మళ్లీ సందడిచేయనుందని టాక్.
బోయపాటి-బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో అమలాపాల్.. కథానాయికగా నటించనుందని సమాచారం. ఇప్పటికే చిత్రబృందం అమలాతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై స్పష్టత రావాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే.
ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ కొత్త సినిమా టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు అమలా కూడా పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది చూడండి : 'అంతరిక్షం' కోసం వరుణ్ ఇలా కష్టపడ్డాడు!