ప్రముఖ సినీనటి అమలాపాల్ మళ్లీ ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయికి చెందిన గాయకుడు భవ్నీందర్ సింగ్తో ఈ అమ్మడు డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ యువ సింగర్ తన ఇన్స్టాలో అమలాతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
2014లో తమిళ దర్శకుడు విజయ్ను పెళ్లిచేసుకుంది అమలాపాల్. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.