ETV Bharat / sitara

చిరు చెర్రీ వైపు-కొరటాల బన్నీ వైపు.. కుదిరేదెలా? - చిరంజీవి 152వ చిత్రం

చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరు ప్లాష్​బ్యాక్​ ఎపిసోడ్​లో నక్సలైట్​ పాత్రలో రామ్​చరణ్​ చేస్తాడని వార్తలొస్తున్నాయి. ​అయితే దర్శకుడు బన్నీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

chiranjeevi
రామ్​చరణ్​-బన్ని
author img

By

Published : Feb 22, 2020, 3:30 PM IST

Updated : Mar 2, 2020, 4:38 AM IST

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 152వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరుతో పాటు అతడి తనయుడు రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో సందడి చేయబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఇందులో చెర్రీని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో నక్సలైట్‌లా చూపించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

అయితే దీనికి ప్రధాన కారణం ఆ పాత్రను ఎవరితో చేయించాలన్న దానిపై సందిగ్దత కొనసాగుతుండటమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇందులోని ఈ కీలక పాత్రను చరణ్‌తో చేయిద్దామని చిరు పట్టుబడుతుండగా.. కొరటాల మాత్రం అల్లు అర్జున్‌ వైపు చూస్తున్నాడని సమాచారం. మరి దీనిపై ఈ ఇద్దరు స్టార్‌ హీరోలతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందా? లేదా? అన్నది క్లారిటీ రాలేదు.

కానీ, చిరు మాత్రం ఏది ఏమైనా ఈ పాత్రను చరణ్‌తో చేయించాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మరి చివరకు ఆ పాత్రను ఎవరు చేస్తారన్నది పక్కాగా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ చిత్రం కోసం 'ఆచార్య' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి : #చిరు152లో మహేశ్​బాబు.. కారణం ఆ హీరోనే!

Last Updated : Mar 2, 2020, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.