ETV Bharat / sitara

అలాంటి కథ దొరికితే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ..!​ - Allu Arjun Bollywood Entry

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని చిత్రసీమలు పాన్‌ ఇండియా జపాన్ని పటిస్తున్నాయి. స్టార్‌ హీరోలందరూ జాతీయ కథానాయకుడిగా ఎదిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అల్లు అర్జున్​ చేరాడు.

AlluArjun pre-planning for Bollywood Entry
త్వరలోనే బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్న అల్లుఅర్జున్​
author img

By

Published : Jan 27, 2020, 5:47 PM IST

Updated : Feb 28, 2020, 4:10 AM IST

'బాహుబలి' చిత్ర విజయాలిచ్చిన స్ఫూర్తితో.. ఇప్పుడు దక్షిణాది స్టార్‌ హీరోలంతా ఉత్తరాదిలో జెండా పాతేందుకు పోటీపడుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్‌ హీరోలు ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో ఉండగా.. అల్లు అర్జున్, మహేష్‌బాబు వంటి అగ్ర హీరోలు ఈ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీపై ఏడాదిన్నర క్రితం నుంచే వార్తలొస్తున్నాయి. సరైన స్క్రిప్ట్‌తో ఉత్తరాదిలో పాగా వేసేందుకు అతను ప్రయత్నిస్తున్నట్లు తాజాగా ఓ జాతీయ మీడియాకు తెలిపాడు.

అంతేకాదు తాను ఏ తరహా చిత్రాలతో హిందీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాననే విషయాన్ని తెలిపాడు. 'గల్లీబాయ్‌', 'భాగ్‌ మిల్కా భాగ్‌' తరహా మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, మురుగదాస్‌ కలయికలో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. దీన్ని పాన్‌ ఇండియా చిత్రంలా ప్లాన్‌ చెయ్యాలని ఆలోచిస్తున్నారని సమాచారం. 'అల.. వైకుంఠపురములో' చిత్ర విజయంతో జోష్‌ మీదున్న బన్నీ.. ఫిబ్రవరి నుంచి సుకుమార్‌ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇదీ చూడండి.. వెంకటేశ్ 'నారప్ప' వచ్చేది అప్పుడే..!

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 4:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.