ETV Bharat / sitara

'పక్కా లోకల్'​ సాంకేతికతతో తెరకెక్కనున్న 'పుష్ప'

స్టైలిష్​స్టార్​ అల్లు అర్జున్​, దర్శకుడు సుకుమార్​ చిత్రం 'పుష్ప'.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తెరకెక్కనుంది. ఇందులో సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు మనదేశానికి చెందినవారే పనిచేయనున్నారు. అంతేకాకుండా 100 శాతం చిత్రీకరణ స్వదేశంలో చేయనున్నారు.

Allu Arjun's Pushpa to be shoot with complete indigenous knowledge
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తెరకెక్కనున్న 'పుష్ప'
author img

By

Published : May 11, 2020, 7:11 AM IST

అగ్ర కథానాయకుల చిత్రాలనగానే... అందులో ఏదో ఒక సన్నివేశం కోసం విదేశాలకు వెళ్లడమో, లేదంటే విదేశీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవడమో పరిపాటి! ఆ మాటకొస్తే ఇటీవల మన సినిమాల్లో విదేశీ హంగులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్‌ కొత్త చిత్రం 'పుష్ప' వంద శాతం మేకిన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందబోతోంది. మన దేశంలోని సినీ కార్మికులకి, సాంకేతిక నిపుణులకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వందశాతం స్థానికంగానే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

Allu Arjun's Pushpa to be shoot with complete indigenous knowledge
'పుష్ప' సినిమా ఫస్ట్​లుక్​

ఎంట్రీకి ఆరు కోట్లు

పాన్‌ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమిది. సుకుమార్‌ దర్శకుడిగా... మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. రష్మిక నాయిక. లాక్‌డౌన్‌ తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో కథానాయకుడి పాత్ర పరిచయం నేపథ్యంలో ఆరు నిమిషాలపాటు సాగే యాక్షన్‌ ఘట్టం ఉంటుందట. ఆ సన్నివేశాల్ని రూ. 6 కోట్ల వ్యయంతో చిత్రీకరిస్తారని సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో, అల్లు అర్జున్‌..పుష్పరాజ్‌ అనే పాత్రలో తెరపై కనువిందు చేయనున్నారు.

ఇదీ చూడండి.. పవన్​ వెండితెర శివతాండవం 'గబ్బర్​సింగ్'కు ఎనిమిదేళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.