ETV Bharat / sitara

pushpa update: బన్నీ 'పుష్ప' అనుకున్న టైమ్​కు రిలీజ్ అయ్యేనా? - sukumar pushpa movie

సుకుమార్(pushpa latest updates)​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. ఈ చిత్రం ముందుగా అనుకున్న తేదీకి(Pushpa Release Date) విడుదలయ్యే పరిస్థితులు కనపడుట లేదు. కొత్త రిలీజ్​ డేట్​ కోసం చిత్రబృందం కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

pushpa
పుష్ప
author img

By

Published : Sep 28, 2021, 5:06 PM IST

Updated : Sep 28, 2021, 6:16 PM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో(pushpa latest updates) ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు కరోనా పరిస్థితులు, మరోవైపు ఇండస్ట్రీలో సమస్యల కారణంగా పెద్ద సినిమాలన్నీ విడుదల వాయిదా పడుతున్నాయి. తాజాగా 'పుష్ప'(Pushpa Release Date) చిత్ర బృందానికి మరో సమస్య వచ్చి పడింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి భాగం క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇటీవల 'పుష్ప'(pushpa song release date) షూటింగ్‌ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకొంది. ఇంకా రెండు పాటలు, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాల్సి ఉంది. ఈలోగా 'గులాబ్‌' తుపాన్‌ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్‌ చేయడం చిత్ర బృందానికి సవాల్‌గా మారింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, అక్టోబరు చివరి నాటికి షూటింగ్‌ పూర్తి చేయడం కష్టమని చిత్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విడుదల తేదీపైనా చిత్ర బృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై 'పుష్ప'(allu arjun new movie) టీమ్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇదీ చూడండి: Pushpa News: అల్లు అర్జున్ 'పుష్ప' కొత్త అప్డేట్

Last Updated : Sep 28, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.