'బుట్టబొమ్మా.. బుట్ట బొమ్మా'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట.. ఎవరిని కదిపినా ఇదే హమ్. భాషలతో సంబంధం లేకుండా రాష్ట్రాలు దాటిపోయిందీ తెలుగు పాట. టిక్‌టాక్ ఓపెన్ చేయడమే ఆలస్యం.. దక్షిణాదితో పాటు ఉత్తరాది యువత ఈ పాటకు నృత్యాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తెలుగు రాకపోయినా మాజీ ప్రపంచ సుందరి శిల్పాశెట్టి సైతం ఈ పాటకు బుట్టబొమ్మాలా మారి స్టెప్పులు వేసింది. ఆ వీడియో బాగా వైరల్ అయింది.
తాజాగా మరో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. అయితే వారిద్దరూ దివ్యాంగులు కావడం ఇక్కడ విశేషం. కాళ్లు లేని ఓ యువకుడు ఈ పాటకు డ్యాన్స్ చేసి వీడియో టిక్‌టాక్‌లో పోస్టు చేయగా.. దానికి డ్యుయెట్ చేసిందో చేతుల్లేని యువతి. ఈ వీడియో కాస్త తిరిగి తిరిగి హీరో అల్లు అర్జున్ వరకూ చేరింది. వీడియో చూసిన బన్నీ.. బాగా భావోద్వేగానికి గురయ్యాడు. దానిని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
-
This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP
— Allu Arjun (@alluarjun) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP
— Allu Arjun (@alluarjun) February 10, 2020This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP
— Allu Arjun (@alluarjun) February 10, 2020
'బుట్టబొమ్మ వీడియోల్లో గుండెను నా తాకిందిదే. సంగీతం మన వైకల్యాన్నీ మరిపిస్తుంది. ఈ వీడియో చూసి ఎంతో సంతోషించాను' అని రాసుకొచ్చాడు బన్నీ. సంగీత దర్శకుడు తమన్.. ఈ వీడియోను షేర్ చేశాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉంది. పూజా హెగ్డే హీరోయిన్. సంగీతమందించిన తమన్‌కు ఇది తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా మారింది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.