ETV Bharat / sitara

అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్​ అమ్మాయి పేరుతో! - tollywood news

బన్నీ-సుకుమార్ కాంబినేషన్​లో రానున్న మూడో చిత్రానికి హీరోయిన్ పాత్ర పేరును టైటిల్​గా నిర్ణయించారట. ఈ విషయంపై రేపు(బుధవారం) ఉదయం 9 గంటలకు స్పష్టత రానుంది.

అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ అమ్మాయి పేరుతో!
అల్లు అర్జున్
author img

By

Published : Apr 7, 2020, 12:42 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్​ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తున్నాడు. గ్రామీణ నేపథ్య కథతో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో చిత్తూరు యాసతో డైలాగ్​లు పలకనున్నాడు బన్నీ. రేపు(బుధవారం).. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఓ అప్డేట్​ను వెల్లడించనున్నారు. ఇది టైటిల్​కు సంబంధించిన విషయమేనని, ఆ పేరు ఇదేనంటూ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టుకు రెండక్షరాల పేరునే నిర్ణయించారని గతంలో వార్తలొచ్చాయి. ఎందుకంటే బన్నీ-సుక్కు కాంబోలో వచ్చిన గత చిత్రాలు 'ఆర్య', 'ఆర్య 2'లకు ఇలాంటి టైటిల్స్ ఉండటం.. వీటికి బలాన్నిచ్చింది. ఇప్పుడు తీస్తున్న సినిమాకు మాత్రం హీరోయిన్ పాత్ర పేరునే టైటిల్​గా పెట్టాలని అనుకున్నారట. అందుకు తగ్గట్లుగానే 'పుష్ప' అనే పేరును ఫిక్స్ చేశారని టాక్. మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత వస్తుంది.

AA20 UPDATE
#AA20 అప్టేడ్ రేపు(బుధవారం) ఉదయం 9 గంటలకు

ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.