Alitho saradaga actor Venkat: 'ఆ అయిదుగురు' చిత్రీకరణలో ప్రమాదం జరిగి మూడు నెలల పాటు మంచంపైనే ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు సినీనటుడు వెంకట్. తన మొదటి చిత్రం 'సీతారాముల కల్యాణం చూతమురారండి' విజయం సాధించినా, చిరంజీవి 'అన్నయ్య'తోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ విషయాలను తెలిపారు.
'సీతారాముల కల్యాణం..' చిత్రీకరణలో భాగంగా దిగ్గజ నటుడు నాగేశ్వరరరావు తన చెంప పగలకొట్టారని అన్నారు వెంకట్. విజయశాంతి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, తమ కుటుంబంతో ఉన్న పరిచయం కారణంగానే గాంధీ టెక్స్కు మోడలింగ్ చేశారని వెంకట్ చెప్పారు.
'సీతారాముల కల్యాణం...'లో హీరోయిన్ను ఎంపిక చేద్దామని వైవీఎస్ చౌదరి ముంబయి వెళ్తే, అప్పుడు చాందినిని వద్దని చెప్పినా.. ఆమెనే హీరోయిన్గా ఎంపిక చేశారని వెంకట్ గుర్తు చేసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీచూడండి: 'సాయిపల్లవి కంటే రష్మిక అందానికే జోహార్లు'