ETV Bharat / sitara

షారుక్-ఆలియా కాంబో మరోసారి!

author img

By

Published : Feb 15, 2021, 6:58 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్​ బ్యానర్​లో ఆలియా భట్ ఓ సినిమా చేయనుందట. 'డార్లింగ్స్'​ టైటిల్​తో తెరకెక్కబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Alia Bhatt to star in Darlings produced by SRK, film to go on floors soon
షారుక్-ఆలియా కాంబో మరోసారి!

బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్​ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. షారుక్ ఖాన్ బ్యానర్​ రెడ్ చిల్లీస్​లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపిందట. 'డార్లింగ్స్' టైటిల్​తో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టు ముంబయిలోని ఇద్దరు మధ్యతరగతి మహిళల నేపథ్యంతో రూపొందనుందని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.

జస్మీత్ కే రీన్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

ప్రస్తుతం ఆలియా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్ర'తో పాటు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.