ఏంటి.. 'అర్జున్ రెడ్డి 2'లో అల్లు అర్జున్ హీరోనా! అనే సందేహంలో పడ్డారా? హీరో కాదండోయ్ 'అర్జున్ రెడ్డి 2'కు దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన 'అల వైకుంఠపురములో' ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రంలోని ఓ డిలిటెడ్ సీన్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.
ఆ 'అర్జున్ రెడ్డి' దర్శనమిచ్చేది ఇక్కడే. ఈ సన్నివేశం బన్నీ, సహనటుడు సుశాంత్‌కు సంబంధించింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న సుశాంత్‌ను పిలిచి "నీకు మద్యం సేవించే అలవాటుందా? డ్రగ్స్ తీసుకుంటావా" అని ప్రశ్నిస్తాడు బన్నీ. "లేదు" అంటూ సమాధానం ఇచ్చిన సుశాంత్ "మరి నువ్వేంచేస్తావ్?" అంటే "షార్ట్ ఫిలింస్ తీస్తుంటా.. ప్రశాంతంగా ఉంది. నిన్న రాత్రి ఒకటి తీశా.. చూస్తారా" అంటూ ఓ వీడియోను చూపిస్తాడు. బన్నీ చిత్రీకరించిన దృశ్యం మరేదో కాదు.. సుశాంత్ సిగరెట్లు, మద్యం సేవించే సన్నివేశం. దానికి తగ్గట్టు 'అర్జున్ రెడ్డి' నేపథ్య సంగీతం వినిపిస్తుంటుంది. మీరు వెలిగించే రెండు సిగరెట్లు చూసే పెట్టా సర్ టైటిల్ 'అర్జున్ రెడ్డి పార్ట్ 2' అంటాడు అర్జున్. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">