ETV Bharat / sitara

రెండో షెడ్యూల్​కు సిద్ధమవుతున్న 'అత్రాంగి రే' - akshay sara dhanush atrangi re

ఆనంద్ ఎల్​.రాయ్​ దర్శకత్వంలో అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​, ధనుష్​ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'అత్రాంగి రే'. ఈ సినిమా షూటింగ్​ తర్వాతి షెడ్యూల్​ అక్టోబర్​లో మొదలుకానుంది. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.

Atrangi Re shoot
రెండో షెడ్యూల్​కు సిద్ధమవుతున్న అక్షయ్​,ధనుష్​ సినిమా
author img

By

Published : Jul 27, 2020, 1:54 PM IST

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్, తమిళ నటుడు ధనుష్‌లతో ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందుతోంది. వీరిద్దరితో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'అత్రాంగి రే'. సారా అలీఖాన్‌ కథానాయిక. ఇప్పటికే మొదలైన ఈ ప్రాజెక్టు... తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.

Akshay, Sara, Dhanush to resume Atrangi Re shoot
అత్రాంగి రే లుక్​

ప్రస్తుతం మళ్లీ షూటింగ్​లు పునఃప్రారంభం అవుతున్న వేళ మళ్లీ పట్టాలెక్కనుందీ సినిమా. కొత్త షెడ్యూల్​ మధురై, దిల్లీ, ముంబయిలో ఉంటుందని సమాచారం.

"లాక్​డౌన్​ సమయంలో చాలా శ్రమించి 'అత్రాంగి రే' షెడ్యూల్​ రూపొందించాం. తర్వాతి షెడ్యూల్​ ప్రారంభించేందుకు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. అక్టోబర్​ నుంచి మధురైలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. అక్షయ్​తో దిల్లీ, ముంబయిలో మరో నెల షూటింగ్​ ఉంటుంది. కచ్చితంగా కరోనా భద్రతా ప్రమాణాలు పాటిస్తాం" అని రాయ్​ తెలిపారు.

2013లో ఆనంద్​, ధనుష్​ కాంబినేషన్​లో రంజానా చిత్రం తెరకెక్కింది. మళ్లీ ఇన్నేళ్లకు మరో సినిమా రానుంది. వారణాసి షెడ్యూల్​లో ఇప్పటికే సారా, ధనుష్​లపై కొన్ని సీన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు ఆనంద్​.

జాతీయ అవార్డు గ్రహీత హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం... 2021 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.