ETV Bharat / sitara

ట్రైలర్: బేర్​గ్రిల్స్​తో అక్షయ్​​ సాహసయాత్ర - Akshay kumar latest news

బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​ బేర్​గ్రిల్స్​తో కలిసి సాహస యాత్ర చేశాడు. దీనికి సంబంధించిన ట్రైలర్​ అభిమానుల్ని అలరిస్తోంది.

Akshay Kumar
అక్షయ్​ కుమార్​
author img

By

Published : Aug 31, 2020, 2:45 PM IST

సాహస యాత్రికుడు​ బేర్​ గ్రిల్స్​తో కలిసి అడ్వెంచర్స్ చేశాడు కథానాయకుడు అక్షయ్​ కుమార్​. ఆ ట్రైలర్​ను​ విడుదల చేసింది డిస్కవరీ ఛానెల్. ఈ సందర్భంగా షూటింగ్​ అనుభవాలతో పాటు, గ్రిల్స్​ తనను ఏ విధంగా ఆశ్చర్యపరిచాడో ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు అక్షయ్​.

"ఈ సాహస యాత్రకు వెళ్లే ముందు గట్టి సవాళ్లు ఎదురవుతాయని ఊహించా. బేర్​ గ్రిల్స్​ ఏనుగు పూప్ టీతో నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచాడు. నిజంగా నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను డిస్కవరీ అందించింది. గ్రిల్స్ చాలా ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నాడు. అతడి శక్తికి, అభిరుచికి నేను ఎప్పుడూ వీరాభిమానినే. అతడితో సాహసాలు చేయడం నిజంగా చాలా మంచి అనుభవం. సినిమా సెట్​లలో లాగా బ్యాకప్​ లేనందున.. రియాలిటీ చాలా థ్రిల్​ ఇచ్చింది"

అక్షయ్​ కుమార్​, సినీ నటుడు

బండిపూర్​ టైగర్​ రిజర్వ్​ ప్రాంతంలో ఈ షూటింగ్​ జరిగింది. ఇందులో బేర్​ గ్రిల్స్​, అక్షయ్​ మిలిటరీ తరహా కసరత్తులను అనుసరించారు. ఈ​ షో సెప్టెంబరు 11న డిస్కవరీ ప్లస్​ యాప్​లో, సెప్టెంబరు 14న డిస్కవరీ ఛానెల్​లో ప్రసారం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.