బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తోన్న చిత్రం 'బెల్‌బాటమ్' చిత్రీకరణ.. లండన్‌లో పునఃప్రారంభమైంది. లాక్డౌన్ తర్వాత మళ్లీ సెట్లో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని అక్షయ్, హీరోయిన్ లారా దత్త తెలిపారు. అన్ని రకాల కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి మాస్క్‌లు ధరించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు దత్త. వీరితో పాటు హ్యూమా ఖురేషి, ఆదిల్ హుస్సెన్‌లు షూటింగ్లో పాల్గొన్నారు.
దీంతో పాటు చిత్రీకరణ సమయంలో వైద్యులను కూడా అందుబాటులో ఉంచుకున్నట్లు ఇటీవలే తెలిపారు అక్షయ్.
-
Lights. Camera. Mask On. Action... #AkshayKumar commences shoot for #BellBottom... Costars #VaaniKapoor, #HumaQureshi and #LaraDutta... Directed by Ranjit M Tewari... 2 April 2021 release. pic.twitter.com/4qsplfYuPI
— taran adarsh (@taran_adarsh) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lights. Camera. Mask On. Action... #AkshayKumar commences shoot for #BellBottom... Costars #VaaniKapoor, #HumaQureshi and #LaraDutta... Directed by Ranjit M Tewari... 2 April 2021 release. pic.twitter.com/4qsplfYuPI
— taran adarsh (@taran_adarsh) August 20, 2020Lights. Camera. Mask On. Action... #AkshayKumar commences shoot for #BellBottom... Costars #VaaniKapoor, #HumaQureshi and #LaraDutta... Directed by Ranjit M Tewari... 2 April 2021 release. pic.twitter.com/4qsplfYuPI
— taran adarsh (@taran_adarsh) August 20, 2020
కన్నడ 'బెల్‌బాటమ్'కు రీమేక్
గతేడాది వచ్చిన కన్నడ 'బెల్‌బాటమ్'కు రీమేక్ ఈ సినిమా. మాతృకలో రిషబ్ శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇందులో కథానాయకుడు అక్షయ్ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్-వాణీ కపూర్ కలిసి కనువిందు చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూడండి ఎస్పీ బాలు కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు