కరోనా కట్టిడిలో భాగంగా ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెబుతూ రూపొందించిన ర్యాప్ సాంగ్లో, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి భాగమయ్యారు. ఈ గీతానికి ముంబయి ధారావికి చెందిన ర్యాపర్స్ ఎమ్సీ అల్తాఫ్, టోనీ సైకో, బాంజ్ ఎన్ రిబ్జ్లు స్వరాలు అందించగా, గల్లీ గ్యాంగ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. దీనిని హిందీ, మరాఠీ, తమిళంలో తెరకెక్కించారు.
జోయెల్ డిసౌజా దర్శకత్వం వహించిన ఈ పాటలో అతుల్ కుల్కర్ణి, దియా మీర్జా, రానా దగ్గుబాటి నటించారు. అయితే ఇందులో భాగంగా కావడం తనకు గౌరవంగా ఉందని, ఈ గీతం తన మనసును తాకిందని సునీల్ శెట్టి చెప్పారు.