1983లో తొలిసారి భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుని సత్తా చాటింది. ఆ ప్రయాణం అనన్య సామాన్యం. ఇప్పుడు ఆ గతస్మృతుల్ని '83' రూపంలో వెండి తెరపైకి తీసుకొస్తున్నారు. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ సినిమాలో రణ్వీర్ సింగ్, తాహిర్ రాజ్ బాసిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి అన్నపూర్ణ స్డూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది.
"1983 ప్రపంచకప్ విజయంతో దేశంలో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. క్రికెట్ అనేది ఓ మతంలా ఉద్భవించింది. ఈ ప్రయాణాన్ని నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం. మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు గర్వంగా ఉంది."
- నాగార్జున, కథానాయకుడు
నాగార్జున అంటే అందరికీ గౌరవమని, ఆయన చేతుల మీదుగా తెలుగులో ఈ చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉందని దర్శకుడు కబీర్‌ఖాన్ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఇదీ చదవండి: ఒక్క చిత్రానికి రూ.120 కోట్ల పారితోషికమా..!