'కాళిదాసు' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన సుశాంత్ 'కరెంట్', 'అడ్డా', 'ఆటాడుకుందాం రా' వంటి సినిమాలతో యువతని బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'చి.ల.సౌ' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి మరిచిపోలేని విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్కో నటుడికి ఒక్కో చిత్రం తమ జీవితంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. సుశాంత్‌కు 'చి.ల.సౌ' అంతటి సంతృప్తినిచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఓ ఛానల్ నిర్వహించిన ఫోన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుశాంత్ ఈ సినిమాను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
నాగ చైతన్య నిశ్చితార్థ వేడుకలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కథ వినిపించగా.. తనకు సరిపోతుందని వెంటనే ఓకే చెప్పినట్లు తెలిపాడు సుశాంత్. రొటీన్‌కు భిన్నంగా ఉండటం వల్ల ముందుగానే విజయం సాధిస్తుందని అనుకున్నానని తెలిపాడు. అలాగే ఈ సినిమా తనలో కొన్ని విషయాల్లో మార్పు తీసుకొచ్చిందని వివరించాడు. 'అల వైకుంఠపురములో' ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించాడు ఈ యువహీరో. ప్రస్తుతం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శన్ తెరకెక్కిస్తున్నాడు. మీనాక్షి చౌదరి నాయిక. లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది.
ఇదీ చూడండి : 'బుట్టబొమ్మ' పాటకు వార్నర్ దంపతులు స్టెప్పులు