కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్‌కు బైక్‌పై ప్రయాణించడం చాలా ఇష్టం. ఆ మధ్య 'వాలిమై' షూటింగ్‌లో హైదరాబాద్ నుంచి చెన్నైకు బైక్ మీదనే వెళ్లారు. ఇప్పుడు మరోసారి రోడ్డు మార్గంలో చాలా దూరం ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు.
పుణె నుంచి సిక్కింకు అజిత్ ప్రయాణమయ్యారు. ఈ దూరం దాదాపు 4500 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో ఓ అభిమానితో కలిసి సెల్ఫీ దిగడం, చాట్ షాపులో తింటూ కనిపించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
'వాలిమై' సినిమాకు హెచ్.వినోత్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకుడిగా 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ నటిస్తున్నారు. హ్యుమా ఖురేషి కీలక పాత్ర పోషిస్తోంది. యవన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.
ఇది చదవండి: మరోసారి పోలీస్ పాత్రలో అజిత్