టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. అక్కినేని యువ హీరో అఖిల్ కథానాయకుడిగా 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అఖిల్‌ను కలిసి అజయ్ కథను వినిపించాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే చిత్రం చేస్తున్నాడు అఖిల్. అలాగే శర్వానంద్, సిద్దార్థ్‌లతో 'మహాసముద్రం' తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఈ చిత్రీకరణలు ముగిసిన తర్వాత అఖిల్-అజయ్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.