ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ - పొన్నియిన్ సెల్వన్ సెట్లో ఐశ్వర్యా రాయ్

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్ పునఃప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమా సెట్​లో అడుగుపెట్టనుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్.

Aishwarya to join sets of Mani Ratnam's Ponniyin Selvan in Ramoji Film City
రామోజీ ఫిల్మ్​సిటీలో 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్
author img

By

Published : Jan 9, 2021, 12:25 PM IST

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. 2019 డిసెంబర్​లో థాయ్​లాండ్​లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కార్తీ, జయం రవి, ఐశ్వర్యా లక్ష్మీ వంటి తారాగణంతో 90 రోజుల షూటింగ్​ను పూర్తి చేశారు. మొదటి షెడ్యూల్ పూర్తవ్వగానే కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమైంది.

రామోజీ ఫిల్మ్​ సిటీలో జనవరి 6 నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్​కు వచ్చిన ఐశ్వర్యా రాయ్ సెట్స్​లో అడుగుపెట్టనుందట. ఈ షూటింగ్ కోసం దాదాపు నెలరోజుల పాటు ఐశ్వర్య ఇక్కడే ఉండనుందని సమాచారం.

లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఐశ్వర్యా లక్ష్మి , శరత్‌ కుమార్‌, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, అదితిరావు హైదరీ తదితరులు నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.