ETV Bharat / sitara

చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో ఐశ్వర్యరాయ్! - ఐశ్వర్యరాయ్ వార్తలు

చాలా సంవత్సరాల విరామం తర్వాత దక్షిణాదిలో, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నటించే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో ఈ విషయమై స్పష్టత రానుంది.

Aishwarya Rai may star in 'Andhadhun's Tamil remake
చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది సినిమాలో ఐశ్వర్యరాయ్
author img

By

Published : Oct 15, 2020, 8:38 AM IST

అందాల భామ ఐశ్వర్యరాయ్.. చాలా రోజుల దక్షిణాదిలో నటించేలా కనిపిస్తోంది. ప్రశాంత్ హీరోగా తెరకెక్కే 'అంధాధున్' తమిళ రీమేక్​ కోసం ఈమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై, త్వరలో స్పష్టత రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 22 ఏళ్ల తర్వాత ప్రశాంత్-ఐశ్వర్య కలిసి నటించనట్లవుతుంది. గతంలో వీరిద్దరూ 'జీన్స్' కోసం జోడీ కట్టారు.

బాలీవుడ్​లో ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అంధాధున్'.. తెలుగులోనూ రీమేక్​ చేస్తున్నారు. నితిన్, తమన్నా, నభా నటేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఒరిజినల్​ సినిమాలో టబు పోషించిన పాత్రలోనే తమన్నా కనిపించనుంది. ఇప్పుడదే పాత్రను తమిళంలో ఐశ్వర్య చేయనుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.