మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. కొంతకాలంగా హీరోగా, నిర్మాతగా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. నిర్మాతగా ప్రస్తుతం అతడి చేతిలో రెండు చిత్రాలున్నాయి. చిరుతో కొరటాల శివ తీస్తున్న 'ఆచార్య'తోపాటు.. సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్న 'లూసిఫర్' రీమేక్. అయితే హీరోగా, 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత చేయబోయే చిత్రంపై ఇప్పటికైతే స్పష్టత రాలేదు. కానీ, చెర్రీ కొత్త సినిమా కొరటాల దర్శకత్వంలోనే ఉండబోతున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
శివతో సినిమా చేయడానికి చరణ్ గతంలోనే ఆసక్తి చూపించాడు. రాజమౌళి చిత్రం పట్టాలెక్కడం వల్ల ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. అప్పుడు కొరటాలకు ఇచ్చిన కాల్షీట్లనే చిరు చిత్రానికి ఉపయోగించాడు చరణ్. ఈ విషయాన్ని 'సైరా' సమయంలో అతడే స్వయంగా వెల్లడించాడు. కానీ, చరణ్‌తో అనుకున్న కథను కొరటాల అలాగే పక్కకు పెట్టి ఉంచాడట. ఇప్పుడా కథతోనే మళ్లీ తమ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంతో కొరటాల శివ నిర్మాతగానూ మారనున్నాడని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి.. ఆ షాట్లో పవన్ లుక్‌లో ఉన్నది హరీశ్ ఆ!