సాహసికుడు బేర్ గ్రిల్స్(bear grylls).. మరో హీరోతో కలిసి అడ్వెంచర్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 'ఇన్‌టూ ది వైల్డ్'(Into the wild Bear grylls) కార్యక్రమం కొత్త ఎపిసోడ్ కోసం ప్రముఖ కథానాయకుడు అజయ్ దేవ్‌గణ్(ajay devgan) అంగీకారం తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనుంది.
అడవిలో సాహసాలు చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రిటీష్ సాహసికుడు బేర్ గ్రిల్స్.. భారత ప్రధాని మోదీ(narendra modi), సూపర్‌స్టార్ రజనీకాంత్(rajnikanth), అక్షయ్ కుమార్‌లతో కలిసి 'ఇన్‌టూ ది వైల్డ్' ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు అజయ్‌తో కలిసి పనిచేయనున్నారు.
'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమాలో చివరగా కనిపించిన అజయ్ దేవ్‌గణ్.. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. గంగూబాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్(rrr release date), మైదాన్, మేడే చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. 'రుద్ర' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తున్నారు.
ఇవీ చదవండి: