ETV Bharat / sitara

మన సినిమాల క్రేజ్.. హిందీలో 'రంగస్థలం'తో పాటు మరిన్ని - రంగస్థలం హిందీ మూవీ రిలీజ్ డేట్

బాలీవుడ్​ ఆడియెన్స్ దక్షిణాది సినిమాలంటే పడిచచ్చిపోతారు! యూట్యూబ్​లో మన డబ్బింగ్ సినిమాల వ్యూస్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలానే ఈ మధ్య 'పుష్ప'తో బన్నీ బంపర్ హిట్ కొట్టారు. దీంతో దక్షిణాదికి చెందిన పలు సినిమాలను నేరుగా ఉత్తరాది థియేటర్లలో రిలీజ్​కు ప్లాన్ రెడీ అవుతుంది.

rangasthalam
రంగస్థలం
author img

By

Published : Jan 19, 2022, 3:07 PM IST

pushpa movie: 'పుష్ప' సినిమా బాలీవుడ్​లో సంచలనం సృష్టించింది. బాలీవుడ్​లో ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజై దాదాపు రూ.80 కోట్ల మేర వసూళ్లు సాధించింది. దీంతో ఇదే ఊపును కొనసాగించేందుకు మరిన్ని దక్షిణాది సినిమాలో త్వరలో హిందీ ప్రేక్షకుల్ని థియేటర్లలో పలకరించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుటికే 'పుష్ప' సినిమాతో బన్నీకి బాలీవుడ్​లో విపరీతమైన క్రేజ్​ వచ్చింది. దీంతో 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్ వెర్షన్​ను జనవరి 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గోల్డ్​మైన్ పిక్చర్స్ వెల్లడించింది.

ala vaikunthapurramuloo hindi dubbed release
అల వైకుంఠపురములో హిందీ వెర్షన్ రిలీజ్ డేట్

ఈ సినిమాకు హిందీ ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి రామ్​చరణ్ రంగస్థలం(ఫిబ్రవరి), విజయ్ మెర్సల్-అదిరింది(మార్చి), అజిత్ 'విశ్వాసం'(ఏప్రిల్) వరుసగా థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటే మరిన్ని దక్షిణాది సినిమాల డబ్బింగ్ వెర్షన్​లను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.