ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆదివారం స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ముందుగా తాను ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపిన అక్షయ్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసమే హాస్పిటల్లో చేరినట్లు వెల్లడించారు.
ఇటీవలే 'రామ్‌సేతు' చిత్రీకరణలో పాల్గొన్నారు అక్షయ్. ఐదు రోజుల షూటింగ్ అనంతరం అక్షయ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా షూటింగ్ వాయిదా పడింది.
రామ్ సేతు సిబ్బందికి కరోనా
అక్షయ్ హీరోగా నటిస్తోన్న 'రామ్‌సేతు' షూటింగ్లో పాల్గొన్న 45 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నేడు (సోమవారం) ఈ సినిమా మరో విడత షూటింగ్ మద్ దీవుల్లో జరగాల్సి ఉంది. ఈ చిత్రీకరణలో 100 పాల్గొనాల్సి ఉండగా వారందరికీ ముందుగా కరోనా టెస్టులు చేశారు. ఇందులో 40 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో పాటు మరో ఐదుగురికి కరోనా నిర్ధరణ అయింది. వీరంతా క్వారంటైన్‌కు వెళ్లారు.