'విక్రమ్ వేదా' హిందీ రీమేక్‌లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటీవలే.. ఈ సినిమా నుంచి ఆమిర్ ఖాన్ తప్పుకోగా.. ఈ చిత్ర నిర్మాతలు హృతిక్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తమిళంలో ఘన విజయం సాధించిన 'విక్రమ్ వేదా'ను సైఫ్ అలీ ఖాన్, ఆమిర్‌తో రీమేక్ చేయాలనుకున్నారు. అయితే.. హిందీ వెర్షన్లో ఈ సినిమా స్క్రీన్‌ప్లే నచ్చకపోవడం వల్ల ఆమిర్ ఇటీవల ఈ సినిమాను వదులుకున్నారు. ఆమిర్ ఈ సినిమాను అంగీకరించకముందు మొదట ఈ చిత్ర దర్శక నిర్మాతలు హృతిక్‌నే కలిసినట్లు సమాచారం. ఇప్పుడు ఆమిర్ ప్రాజెక్టును నుంచి తప్పుకోవడం వల్ల మరోసారి హృతిక్ వద్దకే దర్శకనిర్మాతలు వెళ్లినట్లు తెలుస్తోంది.
మాతృకలో ఆర్.మాధవన్ పోషించిన పోలీసు 'విక్రమ్' పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
ఇదీ చూడండి:'విక్రమ్ వేదా' రీమేక్ నుంచి ఆమిర్ తప్పుకున్నారా?