మాస్ మహారాజ రవితేజ, అందాల తార త్రిష జంటగా మరో సినిమా రానున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'వీర', 'రాక్షసుడు' ఫేం రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. గతంలో రవితేజ, త్రిష కలయికలో వచ్చిన 'కృష్ణ' ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తుండటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఈ చిత్రానికి హీరోగా రవితేజను ఖరారు చేయగా.. కథానాయికగా త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ మూవీలో ఇద్దరు కథానాయికల పాత్రలు ఉండగా.. మరో నాయికగా నిధి అగర్వాల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తూ.. మరో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తానంటూ తెలిపింది. మరి ఆ సినిమా ఇదేనా అనేది తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">