ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్​'లో ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​పై రాజమౌళి - రాజమౌళి టీవీ9 ఇంటర్వ్యూ

'ఆర్ఆర్ఆర్'లోని ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​పై స్పందించిన డైరెక్టర్ రాజమౌళి.. అది ఎప్పుడు వస్తుందో చెప్పారు. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. త్వరలో ప్రారంభించే అవకాశముంది.

'ఆర్ఆర్ఆర్​'లో ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​పై రాజమౌళి
ఆర్ఆర్ఆర్​లో ఎన్టీఆర్
author img

By

Published : Aug 23, 2020, 5:31 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో రామ్​చరణ్​ ఫస్ట్​లుక్.. మార్చిలోనే వచ్చింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్​ ఎలా ఉంటుందోనని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వచ్చారు. మేలో తారక్​ పుట్టినరోజు సందర్భంగా అది వస్తుందని భావించారు. కానీ కరోనా ప్రభావంతో షూటింగ్​లు నిలిచిపోవడం వల్ల అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడీ విషయమై రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫస్ట్​లుక్​పై పెదవి విప్పారు.

rrr ram charan ntr
హీరోలు రామ్​చరణ్​-ఎన్టీఆర్

కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న రాజమౌళి.. ఓ ప్రముఖ ఛానెల్​తో ఫోన్​లో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. దీనితో పాటే 'ఆర్ఆర్ఆర్' సంగతులు పంచుకున్నారు. తిరిగి షూటింగ్ ప్రారంభమైన పది రోజుల తర్వాత తారక్​ లుక్​ విడుదల చేస్తామని అభిమానులకు హామీ ఇచ్చారు.

RRR TEAM
'ఆర్ఆర్ఆర్' టీమ్​

దాదాపు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న తీసుకొస్తామని అన్నారు. కానీ కరోనా వల్ల అది అనుకున్నట్లు జరుగుతుందా లేదా ఆలస్యం అవుతుందా అనేది అందరికి వస్తున్న ప్రశ్న.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.