'క్షణం', 'గూఢచారి' లాంటి విభిన్న సినిమాలతో హిట్లు కొట్టిన హీరో అడివి శేష్. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మిస్తున్న 'మేజర్' చేస్తున్నారు. 26/11 దాడుల్లో వీర మరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్‌ను తీస్తున్నారు. దీని తర్వాత తాను చేయబోయే కొత్త ప్రాజెక్టు గురించి శేష్ ఇప్పుడు ట్వీట్ చేశారు. 'డైరెక్టర్ అండ్ టీమ్ సూపర్. ప్రొడ్యూసర్ నా ఫేవరెట్' అని అడివి శేష్ ఇందులో రాసుకొచ్చారు.
శేష్‌కు ఇష్టమైన వారిలో హీరో నాని ఒకరు. గతేడాది అతడు నిర్మాణంలో వచ్చిన 'హిట్'.. ప్రేక్షకుల్ని అలరించడంలో సక్సెస్ అయింది. ఇటీవల దానికి సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు శేష్ ట్వీట్ చేసింది 'హిట్ 2' గురించేనని, శనివారం అధికారిక ప్రకటన కూడా రానుందని మాట్లాడుకుంటున్నారు. దీని గురించి తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇవీ చదవండి: