"ప్రేక్షకుల్ని కట్టిపడేసే మంచి ఫీల్ ఉన్న సినిమా మా 'డియర్ మేఘ'(Dear Megha movie). ప్రతి ఒక్కరినీ తప్పకుండా కదిలిస్తుంది" అని నటుడు అదిత్ అరుణ్(adith arun) అన్నారు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాను సుశాంత్ రెడ్డి తెరకెక్కించారు. మేఘా ఆకాశ్ టైటిల్ పాత్రలో నటించింది. అర్జున్ సోమయాజుల మరో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు అదిత్ అరుణ్.
* దర్శకుడు సుశాంత్ నాకు మంచి స్నేహితుడు. ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నాం. రెండేళ్ల క్రితం 'డియర్ మేఘ' కథతో నా దగ్గరకొచ్చాడు. విన్న వెంటనే నాకు చాలా నచ్చేసింది. అదే సమయంలో మంచి నిర్మాతలు దొరకడంతో.. మా ప్రయాణం మొదలైంది. ఈ చిత్రాన్ని మేము ఆరు నెలల్లోనే పూర్తి చేశాం.
* మన సినిమాల్లో చాలా వరకు ప్రేమకథలు అబ్బాయిల నుంచే మొదలవుతాయి. వాళ్ల కోణంలోనే సాగుతుంటాయి. ఈ చిత్రం మాత్రం ఓ అమ్మాయి వైపు నుంచి సాగే ప్రేమకథతో రూపొందింది. ఒకమ్మాయి ఓ అబ్బాయిని చూస్తే ఏమనుకుంటుంది? అలాగే అవతల అబ్బాయి ఈ అమ్మాయిని చూస్తే ఎలా స్పందించాడు? ఈ ఇద్దరి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అన్నది కథ.
* నా సినీ కెరీర్ పట్ల నేనెంతో సంతృప్తిగా ఉన్నా. నటుడిగా నాపై ఓ ముద్ర ఉండకూడదనే అనుకుంటున్నా. అందుకే వైవిధ్యభరిత కథలతో ప్రయాణిస్తున్నా. నేను హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి నటుడుగా నిరూపించుకోవాలని ఉండేది. అలాగే రైటింగ్ వైపు ఆసక్తి ఉండేది. సరిగ్గా పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయానికి నాకు జర్నలిజంలోనూ అవకాశమొచ్చింది. అదే సమయంలో నటుడిగా అవకాశం రావడం వల్ల ఇటు వైపు వచ్చా. ప్రస్తుతం నేను 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ'(WWW movie), 'కథ కంచికి మనం ఇంటికి' చిత్రాలతో పాటు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నా.
* నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఇదే బెస్ట్. 'డియర్ మేఘ' అనే టైటిల్ పెట్టేటప్పుడు 'అమ్మాయి పేరుతో పెడుతున్నాం నీకు ఓకే నా' అని అడిగారు దర్శకుడు. 'నాకు కథ ముఖ్యం, టైటిల్ కాదు' అని చెప్పేసరికి అదే పేరు ఖరారు చేశారు. నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: