ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' సినిమా దేశంలోని ప్రతి చిన్న చిన్న గామానికి చేరువవుతుందని అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఫలితంగా ప్రభాస్ మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పారు. ఆ సినిమా తర్వాత డార్లింగ్‌తో తాను తెరకెక్కించబోయే సినిమా రావడం వల్ల.. ఆ చిత్రానికి అదనంగా మరో 30 శాతం ఆదరణ లభిస్తుందని వెల్లడించారు.
మరోవైపు ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమాతో పాటు మరో మూడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ దాదాపుగా సెట్స్‌పైకి వెళ్లిపోయాయి. కానీ అశ్విన్ చిత్రం మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. అయితే తన సినిమా పట్టాలెక్కడం ఆలస్యమవ్వడానికి గల కారణాన్ని వివరించారు ఆశ్విన్. ఆర్ట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారని, అందుకే ఆలస్యమైందని తెలిపారు. మొత్తంగా ఈ గ్యాప్.. ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత బాగా చేసేందుకు దోహదపడిందని చెప్పారు. ఈ ఏడాది జూన్ లేదా జులైలో తన సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్ ఆరంభం