'హార్ట్ ఎటాక్', 'కల్కి' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హీరోయిన్ అదాశర్మ.. నెటిజన్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. పెళ్లి కొడుకు కావాలని చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వీటితో పాటే ఓ పెద్ద వ్యాఖ్యను జోడించి, పెళ్లి కూతురు ముస్తాబుతో ఉన్న ఫొటోలను పంచుకుంది.
"పెళ్లి కుమారుడు కావలెను. అతడు ఉల్లిపాయలు తినకూడదు. రంగు, కులం, ఫాలోవర్స్, రాశి.. లాంటి విషయాలతో పనిలేదు. కచ్చితంగా మూడు పూటలు నవ్వుతూ వంట వండాలి. క్రమం తప్పకుండా షేవింగ్ చేసుకోవాలి. సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. మద్యం, మాంసాహారం ఇంటా బయట నిషేధం. భారత్లోని అన్ని భాషా చిత్రాలపై గౌరవం ఉండాలి. వాటిని చూసి ఆస్వాదించే వాడై ఉండాలి." -ఇన్స్టాలో అదాశర్మ
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే ఈ పోస్ట్ చూసి ఆశ్చర్యానికి గురైన నెటిజన్లు.. ఆమె ఈ నిర్ణయం సరదాగా తీసుకుందా లేదా తికమకలో ఉండి మాట్లాడిందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'బైపాస్ రోడ్', 'కమాండో 3' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందీ భామ.
ఇవీ చదవండి: