ETV Bharat / sitara

ఆ సినిమాలో మహేశ్​, విజయ్​ నటించాల్సింది.. కానీ! - మహేశ్​ , విజయ్​ పొన్నియన్​ సెల్వన్​

ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్​ సెల్వన్​'. ఈ చిత్రంలో రెండు పాత్రలకు మహేశ్​ బాబు, విజయ్​ దళపతిని సంప్రదించారని మణిరత్నం శిష్యుడు ధన శేఖరన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ కథపై వారిద్దరూ ఆసక్తి చూపకపోవడం వల్ల చిత్రబృందం వేరే నటులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

Actually Mahesh Babu and Vijay Thalapathi will star in the movie Ponniyan Selvan!
ఆ సినిమాలో మహేశ్​, విజయ్​ నటించాల్సింది.. కానీ!
author img

By

Published : Jun 5, 2020, 1:15 PM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. భారీ బడ్జెట్​, భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌'. ఈ కథ ప్రారంభంలో తెలుగు హీరో మహేశ్ బాబు, తమిళ హీరో విజయ్​ను దర్శకుడు సంప్రదించారట. అయితే వాళ్లు ఆసక్తి చూపకపోవడం వల్ల మణిరత్నం ఆ ప్రయత్నం విరమించకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ధన శేఖరన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటీవలె మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా ఈ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

Ponniyan Selvan movie
పొన్నియన్​ సెల్వన్ పోస్టర్​

కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో షూటింగ్‌ పూర్తిచేసుకుంది. తమిళనాడు ప్రభుత్వ అనుమతులతో చిత్రబృందం మరో షెడ్యూల్​ ప్రారంభించనుందట. ఐశ్వర్యరాయ్​, విక్రమ్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో జరగనున్న చిత్రీకరణకు ఇప్పటికే వీరిద్దరూ డేట్స్​ కేటాయించినట్లు సమాచారం. మద్రాస్​ టాకీస్​​, లైకా ప్రొడక్షన్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. కార్తీ, జయం రవి, విక్రమ్​ ప్రభు, శోభితా దూలిపాళ్ల, అతిదిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్​ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.​

ఇదీ చూడండి... షాపింగ్​మాల్స్​ తెరిచినా.. సినిమా హాళ్లు బంద్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.