ETV Bharat / sitara

షూటింగ్​ పూర్తి చేసుకున్న 'రష్మీ రాకెట్​' - తాప్సీ రష్మీ రాకెట్​

'తప్పాడ్​' సినిమాతో స్టార్​ హోదాను సొంతం చేసుకుంది హీరోయిన్​ తాప్సీ. ఆమె నటిస్తోన్న కొత్త చిత్రం 'రష్మీ రాకెట్​'. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్​ సెట్లో దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

Actress Taapsee Pannu wraps up shooting for 'Rashmi Rocket'
షూటింగ్​ పూర్తి చేసుకున్న 'రష్మీ రాకెట్​'
author img

By

Published : Jan 26, 2021, 10:04 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ తాప్సీ నటిస్తోన్న కొత్త చిత్రం 'రష్మీ రాకెట్​'. ఇటీవలే గుజరాత్​లోని రణ్​ ఆఫ్​ కచ్​లో తుది షెడ్యూల్​ను ప్రారంభించగా.. మంగవారంతో చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్​మీడియా తాప్సీ ఓ పోస్టు పెట్టింది. ఆ లోకేషన్​లో కెమెరాకు ఫోజులిస్తూ కొన్ని ఫొటోలను దిగి.. వాటిని పంచుకుంది.

Actress Taapsee Pannu wraps up shooting for 'Rashmi Rocket'
తాప్సీ

ఎడారి ప్రాంతంలో పుష్​అప్స్​ తీస్తూ ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలను తాప్సీ తన సోషల్​మీడియాలో షేర్​ చేసింది. అయితే ఓ పర్యాటకురాలిగా ఆ ప్రాంతాన్ని ఆస్వాదించేందుకే అలా పుష్​అప్స్​ తీసినట్లు వెల్లడించింది. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

క్రీడానేపథ్యంలో రూపొందిన 'రష్మీ రాకెట్​' చిత్రానికి ఆకర్ష్​ ఖురానా దర్శకత్వం వహించగా.. రోనీ స్క్రూవాలా, నేహా ఆనంద్​, ప్రంజల్​ ఖంద్​దియా నిర్మిస్తున్నారు.

లోకేషన్​లో చిత్రబృందంతో కలిసి పరుగెత్తుతోన్న తాప్సీ

ఇదీ చూడండి: ఆస్కార్​ రేసులో 'ఆకాశమే నీ హద్దురా'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.