స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పరుగు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి షీలా. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా.. బుధవారం(మార్చి 11న) పెళ్లిపీటలెక్కింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఫొటోను ఫేస్‌బుక్ వేదికగా అభిమానులతో పంచుకుందీ అందాల భామ.
" పెళ్లిరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు"
- షీలా, కథానాయిక.
2006లో విడుదలైన 'సీతాకోకా చిలుక' సినిమాతో.. షీలా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏడాది విడుదలైన 'రాజుభాయ్' సినిమాలో మంచు మనోజ్ సరసన నటించింది. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం 2008లో విడుదలైన 'పరుగు' సినిమాలో బన్నీ సరసన ఆడిపాడింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 'పరుగు' చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్, రామ్, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించింది. 2011లో విడుదలైన 'పరమ వీర చక్ర' సినిమా తర్వాత షీలా తెలుగు తెరకు దూరంగా ఉంది.
ఇదీ చూడండి : భార్యభర్తల్ని తల్లి కొడుకుల్ని చేసిన నెటిజన్