ETV Bharat / sitara

మెహందీ ఆర్టిస్ట్​గా సాయిపల్లవి.. సమంత,అనుపమ కామెంట్ - sai pallavi samantha

హీరోయిన్ సాయిపల్లవి మెహందీ ఆర్టిస్ట్​గా మారింది. సహచర కథానాయికలు సమంత, అనుపమ ఆ వీడియోపై కామెంట్లు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

actress Sai Pallavi put mehndi on the hands of Pipri kids
మెహందీ ఆర్టిస్ట్​గా సాయిపల్లవి.. సమంత,అనుపమ కామెంట్
author img

By

Published : Oct 24, 2020, 7:42 PM IST

నటి సాయిపల్లవి మెహందీ ఆర్టిస్ట్‌గా మారి తన దగ్గరకు వచ్చిన చిన్నారులకు మంచి డిజైన్లు పెట్టింది. ఆ ఫొటోలు, వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా ఈమె ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది.

ఈ మేరకు చిత్రీకరణ మధ్యలో దొరికిన ఖాళీ సమయంలో తనను చూసేందుకు వచ్చిన చుట్టపక్కల ఇళ్లల్లోని పిల్లలకు సాయిపల్లవి సరదాగా గోరింటాకు పెట్టింది. ఆ ఫొటోల్ని అభిమానులతో పంచుకుంటూ.. 'హ్యాపీ క్లయింట్స్‌' అని క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే సాయిపల్లవి షేర్‌ చేసిన ఫొటోలు చూసి సమంత, అనుపమతోపాటు పలువురు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. 'సో క్యూట్‌' అని సమంత స్పందించగా.. 'నువ్వు మంచి మనస్సున్న డార్లింగ్‌' అంటూ అనుపమ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

'పడిపడి లేచే మనసు' సినిమా తర్వాత సాయిపల్లవి నటిస్తున్న తెలుగు చిత్రం 'లవ్‌ స్టోరీ'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. రానా 'విరాటపర్వం'లో ఈమె కథానాయికగా చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.