ETV Bharat / sitara

అసలైన ఆనందం అదేనంటున్న రాశీఖన్నా..

‘అసలు సిసలైన ఆనందమేంటో గుర్తించండి. నిజమైన ఐశ్వర్యమేమిటో ఇకనైనా కనిపెట్టండి’’ అంటోంది నటి రాశీ ఖన్నా. తను అలా ఎందుకు అంటుందంటే..?

actress rashi khanna talk about real happiness
అసలైన ఆనందం ఎక్కడుంది?
author img

By

Published : Jun 27, 2020, 11:35 AM IST

​​ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు చూశాకైనా ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా విధానాలను మార్చుకోవాలని, ఇక నుంచైనా సరికొత్త జీవన సరళిని అలవర్చుకోవాలంటోంది రాశీఖన్నా.

ఇన్నాళ్లు పోటీ ప్రపంచంలో పడి అలుపెరగని రీతిలో పరుగు తీశాం. సంపాదనలోనే సంతోషముందని భ్రమ పడ్డాం. స్వార్థంతో ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్ని ధ్వంసం చేసుకున్నాం. మన ఉనికిని మనమే ప్రశ్నార్థకం చేసుకునే స్థితికి చేరుకున్నాం.

అందుకే ప్రస్తుత కరోనా పరిస్థితుల్ని ఓ హెచ్చరికగా భావిద్దాం. ఇక నుంచైనా జీవన సరళిని మార్చుకుందాం. అసలైన ఆనందం, ఐశ్వర్యాలు ఎక్కడున్నాయో గుర్తిద్దాం. ఈ ప్రశ్నలకు నేనిప్పటికే సమాధానాలు కనుగొన్నా. ఆరోగ్యమే అత్యంత గొప్ప సంపద. మానసిక ప్రశాంతతను సాధించుకోవడం గొప్ప విజయం. సంతోషమే కొత్త విలువైన ఆస్తి. మన ఆనందాల్ని, ప్రేమాభిమానాల్ని అందరితో పంచుకోవడం అసలైన మానవత్వం’’ అని హిత బోధ చేస్తోంది రాశీ ఖన్నా.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.