బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు సరికొత్త బాధ్యతలు తీసుకుంది! ఈ అందాల భామ ప్రస్తుతం చిన్నమ్మగా మారిపోయింది. తన భర్త నిక్ జోనాస్ సోదరుడైన జో జోనాస్-సోఫీ టర్నర్లు సోమవారం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఆ పాపకు విల్లా అని పేరు పెట్టారు.
బుల్లితెరపై వచ్చిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌లో సన్సా స్టార్క్ పాత్రలో నటించింది సోఫీ టర్నర్. సోఫీ-జో జోనాస్ అక్టోబర్ 2017లో నిశ్చితార్థం చేసుకొని.. అనంతరం 2019లో పెళ్లిపీటలెక్కారు. సోఫీ చివరిసారిగా సైమన్ బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'ఎక్స్ మెన్: డార్క్ ఫోనిక్స్' చిత్రంలో జీన్ గ్రే పాత్రలో నటించి అలరించింది.
ఇందులో తన భర్త జో జోనాస్‌తో పాటు అతని సోదరులు నిక్, కెవిన్ జోనాస్‌లు కూడా నటించారు. మొత్తం మీద ప్రియాంక చోప్రా తోడికోడలు అమ్మవ్వడం వల్ల ఇక ప్రియాంక ఎప్పుడు అమ్మౌతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.