నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో నటి పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. అయితే ఆమె పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని టాలీవుడ్ టాక్.
ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతోంది. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జులైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి: ఓ నిర్ణయం.. ఆ అమాయకురాలి జీవితాన్ని మార్చేస్తే?