బాలీవుడ్ నటి పాయల్ ఘోష్‌కు కరోనా సోకిందా? అని వదంతులు వస్తున్న నేపథ్యంలో స్పందించిందీ భామ. మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఏ చిన్న దగ్గు, జలుబు వచ్చినా మహమ్మారి వైరస్ సోకిందేమో అని అందరూ భయపడుతున్నట్లు.. తన కుటుంబసభ్యులు ఆందోళన పడినట్లు వెల్లడించింది.
"గత కొద్ది రోజులగా ఒంట్లో అదో రకంగా ఉంది. ముందుగా చిన్నగా తలనొప్పి ప్రారంభమైంది. తర్వాత రాత్రి జ్వరం వచ్చింది. ఇది కొవిడ్-19 కాదని కచ్చితంగా తెలుసు. నా కుటంబ సభ్యులు మాత్రం ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్య పరీక్షలు చేయగా, మలేరియా జ్వరమని తేలింది. కోలుకుంటాను. కొద్దిరోజుల్లో ఈ వైరస్ అంతమైపోతుందని నమ్ముతున్నాను. అందరం మునుపటిలా సాధారణ జీవితాన్ని గడుపుతామని ఆశిస్తున్నాను"
-పాయల్ ఘోష్,బాలీవుడ్ నటి
ఇటీవల మరణించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్‌తో కలిసి పాయల్ ఘోష్.. 2017లో వచ్చిన 'పటేల్ కి పంజాబీ షాదీ'లో నటించింది. తెలుగులో మంచుమనోజ్ 'ప్రయాణం', జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.