తెలుగులో మూడు సినిమాలే చేసినా, యువతలో క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. 'సవ్యసాచి'తో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్'లో సందడి చేసింది. సూపర్‌స్టార్ మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఇప్పుడు ఓ సినిమాలో ప్రత్యేక గీతంతో అలరించేందుకు సిద్ధమైందట.
![ACTRESS NIDHI AGARWAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6492741_nidhi-agarwal152.jpg)
హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. 'అల్లుడు అదుర్స్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఇందులో ఉన్న ఓ ప్రత్యేక గీతంలో నర్తించేందుకు చిత్రబృందం నిధిని సంప్రదించిందట. దీనికి ఆమె అంగీకరించిందని, త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుందని సమాచారం.