Actress Isha Koppikar shocking allegations: హీరోను ఒంటరిగా కలవనందుకు తనను సినిమా నుంచి తీసేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ నటి ఇషా కోపికర్. ఆ సంఘటన తననెంతో బాధించిందని చెప్పింది.
"మా ఫ్యామిలీలో ఎక్కువమంది డాక్టర్సే. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కెరీర్ ఆరంభించిన కొత్తలో ఓ నిర్మాత నుంచి నాకు కాల్ వచ్చింది. 'మేము చేస్తున్న సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు బాగా నచ్చేశారు. వీలుంటే ఒక్కసారి ఆయన్ని ఏకాంతంగా కలవండి' అని ఆయన చెప్పాడు. నిర్మాత మాటలకు నాకు అర్థం తెలియలేదు. దాంతో ఆ హీరోకి కాల్ చేశా. "ఒంటరిగా మీరు ఒక్కరే నా వద్దకు రండి. మీ స్టాఫ్‌ను వెంటతీసుకుని రావొద్దు" అని హీరో చెప్పడం వల్ల వాళ్ల ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ మాటలకు బాధగా అనిపించింది. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి.. 'నా టాలెంట్‌ను ఆధారంగా చేసుకుని ఆఫర్స్ వస్తే చేస్తా. అది చాలు నాకు' అని గట్టిగా చెప్పేశాను. ఆహీరోను కలవలేదనే ఒకే ఒక్క కారణంతో ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేశారు" అని ఇషా షాకింగ్ కామెంట్స్ చేశారు.
పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఇషా.. అనతి కాలంలోనే నటిగా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి చిత్రం 'ఏక్ థా దిల్ ఏక్ థా ధడ్కన్'తో నటిగా అలరించిన ఆమె తెలుగులో 'చంద్రలేఖ', 'ప్రేమతో రా', 'కేశవ' సినిమాల్లో నటించారు. వరుస సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫేమ్ రాకపోవడం వల్ల కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: మరో రీమేక్‌లో పవన్.. కీలక పాత్రలో సాయితేజ్!