తమిళ స్టార్ హీరో సూర్య.. రియల్ సినతల్లి పార్వతికి రూ.15 లక్షల చెక్‌ను అందజేశారు. ఈమె భర్త రాజకన్ను.. పోలీసు విచారణలో మృతి చెందారు. వీళ్ల కథతోనే తీసిన 'జై భీమ్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సినిమాలో సూర్య.. నిజజీవితంలో పార్వతికి సహాయం చేసిన న్యాయవాది చంద్రు పాత్రలో నటించి మెప్పించారు. దీపావళి కానుకగా నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. విశేషాదరణ దక్కించుకుంది. ఇరులార్ తెగకు చెందిన వ్యక్తులకు ఎదురయ్యే సమస్యలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు!
ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీ.. పార్వతికి సహాయం చేయమని సూర్యను కోరింది. దీనిపై స్పందించిన ఆయన.. రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆమెను మంగళవారం తన ఇంటికి పిలిపించిన సూర్య.. తన వంతు రూ.10 లక్షలు, తన నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ తరఫున రూ.5 లక్షలు.. మొత్తం రూ.15 లక్షల చెక్‌ను పార్వతికి అందజేశారు.
అయితే సినిమాలో తమ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయమని వన్నియర్ వర్గం.. సూర్యకు ఇటీవల లీగల్ నోటీసులు పంపింది. దీనిపై అభిమానుల నుంచి సూర్యకు భారీగా మద్దతు లభిస్తోంది.
ఇవీ చదవండి:
- సూపర్‌హిట్ 'జై భీమ్'పై ఇన్ని వివాదాలు ఎందుకు?
- ''జై భీమ్'తో ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు'
- సూర్య 'జై భీమ్'.. హాలీవుడ్ సినిమాల కంటే టాప్‌లో
- సూర్య.. బయోపిక్‌ల బాస్.. నటనకు కేరాఫ్
- Jai bhim real story: రియల్ రాజన్న భార్యకు ఇల్లు.. లారెన్స్ హామీ
- 25 రోజుల్లో 'జై భీమ్' కోర్టు సెట్.. ఆశ్చర్యపోయిన హైకోర్టు సిబ్బంది
- హీరో సూర్య దాతృత్వం.. ఆదివాసీలకు రూ.కోటి విరాళం
- jai bhim movie review: సూర్య 'జైభీమ్' ఎలా ఉందంటే?