యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి.. ప్రస్తుతం సినీ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రష్మి. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ, జబర్దస్త్ షోలతో కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ..'గుంటూరు టాకీస్' సినిమాలోని సువర్ణ (బోల్డ్ క్యారెక్టర్) పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఈ సినిమాలోని ఓ పాటలో లిప్‌లాక్ సీన్లో నటించాను. నిజానికి ఆ పాత్ర చేసినందుకు నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఈ లిప్‌లాక్ సీన్ గురించి హీరో సిద్ధు, దర్శకుడు ప్రవీణ్ చాలా సేపు వివరించారు. నేనెక్కడ ఈ సన్నివేశాన్ని చేయనేమోనని భయపడ్డారు. కానీ నేను చేస్తానని అవలీలగా చెప్పేశాను."
-రష్మి, నటి.
2002లో 'సవ్వడి' సినిమాతో కెరీర్ ప్రారంభించింది రష్మి. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. అనంతరం పలు చిత్రాల్లో సహాయ నటిగా, పలు ప్రదర్శనలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇదీ చూడండి : నిఖిల్, ఐశ్వర్య రాజేశ్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్