రావు గోపాలరావు తనయుడిగా తెరంగ్రేటం చేసినా తన నటనతో ప్రత్యేకత చాటుకున్నాడు రావు రమేశ్. బాలకృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన 'సీమసింహం' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. 'కొత్త బంగారు లోకం', 'గమ్యం' చిత్రాలో పోషించిన పాత్రలు.. నటుడిగా అతడికి మరింత పేరు తీసుకొచ్చాయి. విలక్షణ నటన ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇలాంటి నటుడికి నటన అంటే అంతగా ఆసక్తి లేదంటే నమ్మగలమా!
రావు రమేశ్ ముందుగా దర్శకుడు అవుదామనుకున్నాడట. ఈ విషయం వాళ్ల అమ్మకి చెప్పగా.. "దర్శక్వతం అంటే 24 విభాగాలుంటాయి. డైరెక్టర్ అంటే లెన్స్‌లు తెలిస్తే చాలదు, జీవితం తెలియాలి. ముందు ముళ్ల బాట ఉంటుంది. తర్వాత వెలుగు కనిపిస్తుంది. ప్రస్తుతం నటించు. నీకు నటన చాలా తేలిక" అని సమాధానం ఇచ్చిందట. అలా దర్శకుడు కావాల్సిన నేను నటుడయ్యానని ఓ సందర్భంలో చెప్పాడు రావు రమేశ్.
ఇదీ చూడండి.. 'ఎవడు' దర్శకుడితో మరోసారి చరణ్!