ETV Bharat / sitara

నిలకడగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి - టాలీవుడ్​లో కరోనా

కరోనాతో పోరాడుతున్న హీరో రాజశేఖర్​ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ రత్నకిశోర్ వెల్లడించారు. ఆయన్ని వైద్యులు నిరంతం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

actor rajaskehar health update
నటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్
author img

By

Published : Oct 24, 2020, 3:35 PM IST

కరోనా బారినపడి అనారోగ్యానికి గురైన సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వెల్లడించింది. క్లిష్ట పరిస్థితుల నుంచి ఆయన బయటపడ్డారని ఆస్పత్రి డైరెక్టర్ రత్నకిశోర్ పేర్కొన్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

రాజశేఖర్ సతీమణి జీవిత కూడా కరోనాతో ఇక్కడే చేరారని, చికిత్స అనంతరం మరోసారి పరీక్షించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. శనివారం ఆమెను ఇంటికి పంపించనున్నట్లు స్పష్టం చేశారు. రాజశేఖర్​ను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నట్లు రత్నకిశోర్ వివరించారు.

actor-rajaskehar-health-update
రాజశేఖర్ హెల్త్ బులెటిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.