శ్వాసకోస సంబంధిత సమస్యలతో, బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలిన మండ్య ఎంపీ సుమలతను, ఈయన ఇటీవలే కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకూ కరోనా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
రాక్‌లైన్ వెంకటేశ్.. తెలుగులో రవితేజ 'పవర్' సినిమాను నిర్మించారు. రజనీకాంత్ 'లింగ'కు నిర్మాతగా, సల్మాన్‌ఖాన్ 'బజరంగీ భాయ్‌జాన్'కు సహనిర్మాతగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: