ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది కరోనా మహమ్మారి. తెలుగు రాష్ట్రాల్లోనూ నానాటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ఏపీ, తెలంగాణల్లో మెరుగ్గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే, కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులే ప్లాస్మా దానం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై అన్ని ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు నాని కూడా ప్లాస్మా దానం చేయడానికి ప్రజలు ముందుకు రావాల్సిందిగా కోరారు. ఆ వీడియోను సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.
-
Save a Life by Donating Your Plasma @NameisNani @TelanganaDGP @SCSC_Cyberabad @TelanganaCOPs pic.twitter.com/DssvCOPtyB
— Cyberabad Police (@cyberabadpolice) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Save a Life by Donating Your Plasma @NameisNani @TelanganaDGP @SCSC_Cyberabad @TelanganaCOPs pic.twitter.com/DssvCOPtyB
— Cyberabad Police (@cyberabadpolice) August 3, 2020Save a Life by Donating Your Plasma @NameisNani @TelanganaDGP @SCSC_Cyberabad @TelanganaCOPs pic.twitter.com/DssvCOPtyB
— Cyberabad Police (@cyberabadpolice) August 3, 2020
"మనందరం కొవిడ్ టైమ్స్‌లో ఉన్నాం. కొన్ని లక్షలమంది కరోనా బారినపడ్డారు. అనేక లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇలాంటి వాళ్లకు ఓ మంచి అవకాశం లభించింది. కొవిడ్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వారు కోలుకోవాలంటే ప్లాస్మా అవసరం. మీరు దానం చేసే 500ఎం.ఎల్ ప్లాస్మా ఇద్దరి లైఫ్ కాపాడుతుంది. మళ్లీ రెండు మూడు రోజుల్లో మీ శరీరం ప్లాస్మాను తయారు చేసుకుంటుంది. ఈ చిన్న సాయం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకే సైబరాబాద్ పోలీసులు కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 94906 17440 ఫోన్ చేసి ప్లాస్మా దానం చేయాలనుకునే వారు మీ పేర్లు నమోదు చేసుకోండి. మీ చిన్న సాయం వల్ల బోలెడు ప్రాణాలు కాపాడుకోవచ్చు" అని అన్నారు.