టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్స్‌గా సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జోడీ పేరుతెచ్చుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నేడు 15వ పెళ్లిరోజు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఇద్దరూ తమ అధికారిక సామాజిక మధ్యమాల ద్వారా ఆసక్తికర పోస్టులు పెట్టారు.
" ప్రతి అమ్మాయి కలలుగనే అద్భుతమైన ప్రపంచాన్ని నాకిచ్చావు. జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమను ముద్దులొలికే మన ఇద్దరు పిల్లల రూపంలో నింపేశావు. మీ ప్రేమానురాగాలతో మన ఇల్లు కళకళలాడుతోంది. మీ తోడు నాకెప్పుడూ ఉంటే చాలు. ఇంతకన్నా ఏం కావాలి. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. నా జీవితంలో భాగమైనందుకు లవ్ య్యూ"
- నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సారాంశం
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
స్టార్హీరో అయినా సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే భార్య, పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తాడు మహేశ్. అంతేకాదు అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజునూ గుర్తుచేసుకుంటూ ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నాడు ప్రిన్స్ మహేశ్.
కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తా..
"హ్యాపీ 15 మై లవ్.. ప్రతి రోజూ కొంచెం ఎక్కువ ప్రేమని నీపై చూపిస్తా" అని ట్వీట్ చేశాడు మహేశ్. వీరిద్దరికీ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2000లో వచ్చిన 'వంశీ' చిత్రంలో మహేశ్, నమ్రత జంటగా నటించారు. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత 2005లో ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత నమ్రత సినిమాలు మానేసి తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తోంది.
-
Happy 15 my love!! ❤ Love you a little more each day 🤗 #Namrata💕 pic.twitter.com/Bih2VrwdDF
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy 15 my love!! ❤ Love you a little more each day 🤗 #Namrata💕 pic.twitter.com/Bih2VrwdDF
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2020Happy 15 my love!! ❤ Love you a little more each day 🤗 #Namrata💕 pic.twitter.com/Bih2VrwdDF
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2020
ఇదీ చూడండి.. శ్రీవారిని దర్శించుకున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం