తొలి సినిమా 'ఆర్ ఎక్స్ 100'తో ఒక్కసారిగా పాపులరైన హీరో కార్తికేయ. ప్రస్తుతం 'హిప్పీ'తో పాటు పేరు నిర్ణయించని మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా టైటిల్ను రేపు మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు వెల్లడించనున్నామని తెలిపాడీ హీరో.
బోయపాటి శిష్యుడు అరుణ్ జంధ్యాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనఘ ఎల్.కె హీరోయిన్గా నటిస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇది చదవండి: విద్యార్థుల ఆత్మహత్యలపై హీరో నాని భావోద్వేగం